Friday, July 4, 2014

HOMOEO MEDICINES - telugu


హోమియో వైద్యం ప్రకారం వ్యాధి వచ్చిన కాలాన్ని బట్టి దాని నివారణ సమయం వుంటుంది . అనగా దెబ్బలు షాక్ లు వంటివి - హోమియో మందులకు వెంటనే తగ్గిపోవడం జరుగుతుంది . 
అలాగే విపాకాలు ఐన అస్తమా ,కీళ్ళ నొప్పులు వంటి దీర్ఘ కాల రోగాలు పూర్తిగా నివారణ జరగడానికి కొంత సమయం పడుతుంది . 

లక్షణాలను బట్టి సరి చూసుకుని క్రింది మందులను వాడుకోవచ్చు . 

దెబ్బలు :

1. గీక్కుపోయిన దెబ్బలకు - hypericum . 200 


2. రేకుల వల్ల కోసుకుపోయి లోతుగా కత్తి వల్ల లేదా ఆపరేషన్ వల్ల కలిగిన గాయాలు మానడానికి 
   - staphisagria . 200 


3. గట్టి దెబ్బ తగిలి నలిగి కదుములు కట్టి , ఎర్రగా పచ్చగా కమిలిన దెబ్బలకు - arnica. 30
   ఆ తరువాత arnica . 200 ఉపయోగిస్తే గడ్డ కట్టిన రక్తము మరల మాములుగా ప్రవహించి 
   వెంటనే గాయము మానిపోతుంది . 



చిన్న పిల్లల్లో జలుబు :

1. ముక్కు దిబ్బడ వేసి పట్టేసి ఊపిరి ఆడనప్పుడు - sambucus . 30 , sambucus. 200


2. ఆగకుండా తుమ్ములు వస్తుంటే - sabadilla . 30 తరువాత sabadilla . 200 


3. చిరాకుతో పిల్లలు ఆపకుండా ఎత్తుకోమని ఏడుస్తుంటే - chamomella . 30 / . 200



విరేచనములు : 


1. ఎక్కువగా , దుర్వాసన తో , yellow కలర్ లో కొద్దిగా కడుపు నొప్పి వున్నప్పుడు 
   - podophyllum . 200


2. కడుపులో శబ్దాలు , గ్యాస్ బయటికి వస్తుంది అనే భయం , కడుపులో వాయువు ఒక వైపు      నుండి ఇంకో వైపుకు కదులుతూ వుంటుంది . sphincter weakness . ఏదైనా తిన్న      వెంటనే వెళ్ళవలసి వుంటుంది - aloe . 200 


3. తిన్న వెంటనే తాగిన వెంటనే వెళ్ళవలసి వస్తుంది . (పిల్లల్లో పాలు తాగంగానే వెళతారు )
   అజీర్తి . తిన్నది తిన్నట్టు గ పోవచ్చు . ఒక్కసారిగా వస్తుంది . yellow , watery        motion - croton tig . 200 


4.  స్వీట్ లు choclate ఐస్ క్రీం లు తిన్న వెంటనే కలిగే విరేచనములు . 
    green color ,టెన్షన్ వలన కలుగుతాయి , ప్రయానములు , ఏదైనా సందర్భములు         మాట్లాదవలసినప్పుడు - argnit . 200 


5. పిల్లల్లో పళ్ళు వచ్చేటప్పుడు . ఆకుపచ్చగా వెళుతూ వుంటారు . ఆపకుండా ఏడుస్తూ వుంటారు    - chamomella . 200 


6.  పిల్లల్లో జలుబు దగ్గు జ్వరం విరోచనాలు తరచూ వస్తు వుంటాయి . అన్ని కలిసి ఉండచ్చు .       పిల్లలు గంటలు తరబడి ఆపకుండా ఏడుస్తారు . ఎత్తుకుని తిప్పాలి .urine కి వెళుతూ         ముక్కుతూ వుంటారు  - ocimum . 200 


7. ఎక్కువ oil ,fatty foods తినడం వల్ల కలిగే విరేచనములు . దాహం వుండదు .        మోషన్ గ్యాస్ తో పాటు సౌండ్ తో వస్తుంది . ఒక్కోసారి వెళ్ళినప్పుడు ఒక్కో రంగులో 
   వుంటుంది . - pulsatilla . 200. 


8. నలుపు రంగు మోషన్ - leptandra . 200 


9. ఆపకుండా విరేచనాలు అవుతాయి . చల్లటివి తాగాలని తపన . తాగిన నీళ్ళు కడుపులోకి 
   వెళ్లి వేడెక్కగానే వాంతి అయిపోతుంది . మోషన్ కంట్రోల్ లో వుండదు - phosphorus . 
   200


10.ఎదైన విష ఆహరం తీసుకున్నాక అయ్యే మోషన్స్ . విపరీతమైన నీరసం కలుగుతుంది- 
   arsenic . album . 200 


11. అర్ధ రాత్రి 12 గంటల సమయం లో అవుతుంటే - china . 200 


12. కలరా - పెద్ద పెద్ద మోషన్స్ . పిండిలో నీళ్ళు కలిపి పోసినట్టు , విపరీతమైన చమటలు , 
    విపరీతమైన నీరసం . - veratrum . album . 200 


13. rice water లాగ మోషన్స్ అవుతూ వుంటాయి . ఒళ్ళు చల్లబదిపోతుంది . pulse 
    తగ్గిపొతున్ది. B.P పడిపోతుంది . చమటలు వుండవు . - camphor . 200 


14. spicy food తిని అరగక కొంచెం కడుపు నొప్పి తో మోషన్స్ . - nux.vomica. 200